కామారెడ్డిలో ఇంఛార్జి శానిటరీ ఇన్స్టెక్టర్ పర్వేజ్ తీరుపై కార్మికులు ఆందోళన దిగారు. మంగళవారం.. దొంగతనం నెపంతో ఓ కార్మికుడిపై పర్వేజ్ దాడికి పాల్పడినట్లు పారిశుద్ధ్య కార్మికులు ఆరోపించారు. నిరసనగా విధులు బహిష్కరించారు. పర్వేజ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శానిటరీ ఇన్స్పెక్టర్పై చర్యలకు పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ - కామారెడ్డిలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
కామారెడ్డిలో ఇంఛార్జి శానిటరీ ఇన్స్టెక్టర్ పర్వేజ్పై చర్యలు తీసుకోవాలని పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేశారు. చిన్న తప్పులను పెద్దవిగా చూపుతూ దాడులకు పాల్పడుతున్నారని కార్మికులు ఆరోపించారు.

గత కొంతకాలంగా ఇంఛార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ పర్వేజ్.. కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నాగన్న ఆరోపించారు. చిన్న తప్పులను పెద్దవిగా చూపుతూ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. శేఖర్ అనే కార్మికుడిని చెప్పులు దొంగలించాడనే ఆరోపణపై దాడికి పాల్పడినట్లు నాగన్న తెలిపారు. పర్వేజ్పై చర్యలు తీసుకునేంతవరకు విధులకు హాజరుకాబోమని స్పష్టం చేశారు. దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేసినట్లు కార్మికులు తెలిపారు.
ఇవీచూడండి:కేంద్ర ప్రభుత్వ విధానాలపై దేశవ్యాప్త నిరసనలు: రైతు సంఘం