తెలంగాణ

telangana

ETV Bharat / state

సోమేశ్వర ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన సభాపతి - శ్రావణ మాసం

శాసన సభాపతి పొచారం శ్రీనివాస్ రెడ్డి  కామరెడ్డి జిల్లా నసురుల్లాబాద్​లోని సోమేశ్వర దేవస్థానంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. భక్తుల అవసరాల దృష్ట్యా రూ. కోటి పదిలక్షలతో నిర్మించిన కల్యాణ మండపం, శౌచాలయాలను ప్రారంభించారు.

సోమేశ్వర ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన సభాపతి

By

Published : Aug 27, 2019, 5:06 AM IST

Sabhapati is the founder of several development programs at Someshwara Temple

శ్రావణ మాసం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర ఆలయంలో పలు అభివృద్ధి పనులను శాసనసభాపతి పోచారం శ్రీనివాస్​ రెడ్డి ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా నసురుల్లబాద్​ మండలం దుర్కిలో కొలువై ఉన్న స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో టూరిజం డెవలప్​మెంట్ ఫండ్ కింద రూ.కోటి పది లక్షలతో నిర్మించిన కల్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, పరిషత్ ఛైర్మన్ శ్రీమతి ధపెదర్​ శోభరాజు, బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్, డిఎస్పీ యాదగిరి, తహసీల్దారు అర్చన ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details