కామారెడ్డి జిల్లాకేంద్రంలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న సుతారి శ్రీనివాస్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సామాజిక మాధ్యమాల్లో తనపై తప్పుగా పోస్టింగ్‌లు పెట్టినందుకు ఎలుకల మందు తాగాడు. కుటుంబీకులు అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి కామారెడ్డికి శ్రీనివాస్ నడుపుతున్న బస్సులో మేడ్చల్ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న సిద్దిరాములు అనే కండక్టర్ ఎక్కాడు. మెదక్ జిల్లా రామాయంపేటలో ఆపమని కోరగా... అది నాన్‌స్టాప్ అని అక్కడ ఆగదని చెప్పాడు. వాగ్వివాదానికి దిగిన రాములు... శ్రీనివాస్ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పెట్టి అసభ్యకరంగా రాశాడు. మనస్తాపం చెందిన శ్రీనివాస్ ఎలుకల మందు తాగాడు. పరిస్థితి విషమంగా ఉన్నందున అతన్ని హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించారు.
మనస్తాపంతో బస్‌డ్రైవర్ ఆత్మహత్యాయత్నం - rtc-driver-suicide-attempt
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టింగ్‌లు పెట్టినందుకు తీవ్ర మనస్తాపంతో కామారెడ్డి జిల్లాకేంద్రానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స కోసం అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలిస్తున్న సహోద్యోగులు
డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలిస్తున్న సహోద్యోగులు
తన భర్తను అకారణంగా దూషించిన రాములుపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ భార్య ఆర్టీసీ అధికారులను కోరింది.
ఇదీ చదవండిః కాళేశ్వరం పిటిషన్లపై నేడు ప్రత్యేక ధర్మాసనం విచారణ