తెలంగాణ

telangana

ETV Bharat / state

మరణించిన ఆర్టీసీ డ్రైవర్​ కుటుంబానికి సాయం - victim family

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఎలాంటి ప్రయోజనం కలకగపోవడం వల్లే డ్రైవర్​ గుండెపోటుతో మరణించినట్లు మృతుడి కుటుంబసభ్యులు తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్​ ప్రతినిధి సుభాశ్​ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి 11 వేల ఆర్థిక సాయం అందించారు.

మరణించిన ఆర్టీసీ డ్రైవర్​ కుటుంబానికి సాయం

By

Published : Oct 23, 2019, 8:06 PM IST

మరణించిన ఆర్టీసీ డ్రైవర్​ కుటుంబానికి సాయం
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోలి లింగాలలో నిన్న రాత్రి గుండెపోటుతో మృతిచెందిన ఆర్టీసీ డ్రైవర్ గఫర్​ ఉద్దీన్ మనస్థాపానికి గురయ్యే చనిపోయాడని కుటుంబసభ్యులు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెతో ఎలాంటి ప్రయోజనం కనబడకపోవడం వల్లనే కలత చెందినట్లు స్పష్టం చేశారు. బాధిత కుటుంబాన్ని ఇవాళ ఉదయం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్​ పరామర్శించి.. అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

టీపీసీసీ ప్రతినిధి వడ్డేపల్లి సుభాశ్​ రెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి రూ.11000 ఆర్థిక సహాయం అందించారు. మృతుడికి 15 నెలల క్రితమే వివాహమైంది. అతనికి నాలుగు నెలల కుమార్తె ఉంది.

ABOUT THE AUTHOR

...view details