తెలంగాణ

telangana

ETV Bharat / state

హెల్మెట్​ ధరించి చిన్నారుల నృత్యాలు.. రోడ్డు ప్రమాదాలపై అవగాహన - కామారెడ్డి జిల్లా

కామారెడ్డిలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు హెల్మెట్​ ధరించి నృత్యాలతో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు.

హెల్మెట్​ ధరించి చిన్నారుల నృత్యాలు.. రోడ్డు ప్రమాదాలపై అవగాహన
హెల్మెట్​ ధరించి చిన్నారుల నృత్యాలు.. రోడ్డు ప్రమాదాలపై అవగాహన

By

Published : Feb 1, 2020, 8:03 PM IST

హెల్మెట్​ ధరించి చిన్నారుల నృత్యాలు.. రోడ్డు ప్రమాదాలపై అవగాహన

కామారెడ్డిలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద జిల్లా రవాణా అధికారి వాణి.. రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు హెల్మెట్​ ధరించి నృత్యాలు చేస్తూ అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత నియమాలు పాటించకపోవడం వల్ల జరిగే అనర్థాలను వివరంగా తెలిపారు.

ద్విచక్రవాహనంపై వెళ్లేటప్పుడు శిరస్త్రాణం కచ్చితంగా ధరించాలని జిల్లా రవాణా అధికారి వాణి సూచించారు. కార్లు లేదా ఏదైనా వాహనంలో ప్రయాణించేటప్పుడు సీటు బెల్ట్ కచ్చితంగా ఉపయోగించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం.. 60కి మించి వేగంతో వెళ్లరాదన్నారు. అలాగే మైనర్​లకు మోటార్ వాహనాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశఆరు. ఒకవేళ ఇస్తే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని హెచ్చిరించారు.

ఇవీ చూడండి:'రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహన ఉంటే మేలు'

ABOUT THE AUTHOR

...view details