కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి గేట్ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. శుక్రవారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గోపాల్ ను..... మెదక్ నుంచి ఎల్లారెడ్డి వైపు వెళ్తున్న కారు ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందాడు. కారుపై పడి ఉన్న మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి వెళ్లేందుకు వాహనదారుడు ప్రయత్నించాడు. కారు ముందుకెళ్లి ఆగిపోగా అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.
కారు ఢీకొని వ్యక్తి మృతి.. రోడ్డుమీదే కుటుంబసభ్యుల ధర్నా - road accident in dharmareddy gate
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి గేట్ వద్ద జరిగింది.
కారు ఢీకొని వ్యక్తి మృతి.. రోడ్డుమీదే కుటుంబసభ్యుల ధర్నా
ఘటనాస్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. రెండు గంటలపాటు వాహనాలు నిలిచిపోగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అక్కడకు చేరుకున్న సీఐ, ఎస్సైలు కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా ఆందోళనను విరమించారు.
ఇవీ చదవండి:కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు