కామారెడ్డి జిల్లాలో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు చోట్ల వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. బీర్కూర్ మండలంలోని బీర్కూర్, ప్రకాశ్‌రావు క్యాంపు గ్రామాల్లో వరి పంట నేలకొరిగింది.
నేలకొరిగిన వరి పైరు.. అన్నదాత కళ్లలో కన్నీరు
ఆరుగాలం శ్రమించి పండించిన పంటంతా నేలకొరిగింది. కర్షకుల కష్టమంతా నీటిపాలవుతోంది. అకాల వర్షం అన్నదాతల పాలిట శాపమై.. వారిని నష్టాల ఊబిలోకి నెట్టేస్తోంది.
నేలకొరిగిన వరి పైరు
మంజీరా పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షానికి వరి గింజలు నేలరాలాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయానికి నేలకొరిగిందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
- ఇదీ చదవండి :మధిర ప్రభుత్వాసుపత్రిలోకి మోకాలి లోతు వరద నీరు..