Revanth Reddy Nomination in Kamareddy 2023 :ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అందులోనూ కామారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ నియోజకవర్గం నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పోటీ(CM KCR Vs Revanthreddy) చేస్తుండటంతో అందరి దృష్టి ఇక్కడే కేంద్రీకృతమైంది. గురువారం ఏకాదశి సందర్భంగా కామారెడ్డిలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నామినేషన్ వేయగా.. చివరి రోజు పీసీసీ అధ్యక్షుడు నామపత్రాలు దాఖలు చేశారు.
ఇందుకోసం ప్రత్యేక హెలీకాప్టర్‌లో కామారెడ్డి వెళ్లిన పీసీసీ అధ్యక్షుడు.. ముందుగా పార్టీ నేత షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లారు. అక్కడ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, నాయకులు సుదర్శన్‌రెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్, ఇతర నేతలతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కామారెడ్డిలో కాంగ్రెస్ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, బీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కోవడంపై చర్చించారు. నాయకులు అందరూ విభేదాలను పక్కన పెట్టి.. కాంగ్రెస్ గెలుపుకు కృషి చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు.
KC Venugopal Meet with Parliament Abservers : 'వ్యూహాత్మకంగా ముందుకెళ్తేనే అధికారం చేజిక్కుంచుకోగలం'
నామపత్రాలు సమర్పించిన రేవంత్ రెడ్డి :కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆర్డీవో కార్యాలయానికి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. అనంతరం అక్కడ నామపత్రాలు సమర్పించారు. మరోవైపు రేవంత్‌రెడ్డికి నామినేషన్ డబ్బును కోనాపూర్ గ్రామస్థులు అందజేశారు. కామారెడ్డి జిల్లాలోని కోనాపూర్ సీఎం కేసీఆర్ పూర్వీకుల స్వగ్రామం. ఇటీవల సీఎం కేసీఆర్ కోనాపూర్ వెళ్లి నామినేషన్లకు పూజలు చేసిన విషయం తెలిసిందే. ముందు నుంచి కామారెడ్డిలో కేసీఆర్‌తో ఢీ అంటూ కాంగ్రెస్ ప్రచారం సాగించింది. అలాగే గజ్వేల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్‌కు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అడ్డుగా నిలుస్తున్నారు. ఈ రెండు చోట్ల ప్రధాన పార్టీ అభ్యర్థులు తలపడడంతో.. రాష్ట్రంలో రాజకీయం కాకరేపుతోంది.
Telangana Assembly Elections 2023 :పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొడంగల్‌తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై.. కామారెడ్డి నుంచి పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో ఈరోజు మధ్యాహ్నం రేవంత్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బీసీ డిక్లరేషన్ సభలో పాల్గొననున్నారు. అధికారంలోకి వస్తే బీసీలకు ఏం చేస్తామనే హామీలతో బీసీ డిక్లరేషన్ పెట్టినట్లు పార్టీ నేతలు వెల్లడించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రానున్నారు. కర్ణాటక సీఎం బీసీ డిక్లరేషన్ విడుదల చేస్తారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ వెల్లడించారు. కామారెడ్డిలో నిర్వహిస్తున్న ఈ సభకు కాంగ్రెస్ అధిష్ఠానం భారీ ఏర్పాట్లను చేసింది.
CM KCR Vs Revanth Reddy in Kamareddy : నువ్వా నేనా.. కామారెడ్డిలో కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి?
Revanth Reddy on Congress Declarations : 'చేతి గుర్తు మా చిహ్నం.. చేసి చూపించడమే మా నైజం.. కర్ణాటకలో చేశాం.. తెలంగాణలోనూ చేస్తాం'