కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఓ వివాహానికి హాజరయ్యారు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి. రేవంత్‌కు స్థానిక కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఖర్చు చేసిన సొమ్మును తిరిగి అక్రమంగా సంపదిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. హైదరాబాద్ కూకట్పల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 376లో మూడు వందల కోట్లు విలువ చేసే 15 ఎకరాల భూమి కబ్జాపై తను ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.
రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు: రేవంత్ రెడ్డి - revanth reddy comments on ktr in kamareddy
ఎన్నికల్లో చేసిన ఖర్చును దోచుకునేందుకు అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో వివాహానికి హాజరయ్యారు.

రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు: రేవంత్ రెడ్డి
TAGGED:
malkajigiri mp revanth reddy