Revanth Reddy Campaign in Kamareddy : కామారెడ్డి ప్రజల తీర్పును దేశం నిశితంగా గమనిస్తోందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పదేళ్లలో ప్రజలకు కేసీఆర్ చేసింది ఏమీ లేదని విమర్శించారు. వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా వైశ్యులను కేసీఆర్ సర్కార్ మోసం చేసిందని ఆరోపించారు.
ఈ క్రమంలోనే వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్న ఆయన.. గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే.. వారి కుటుంబానికి రూ.10 లక్షలు, పిల్లల చదువుకు సాయపడేలా హస్తం పార్టీ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో రేవంత్ పాల్గొని మాట్లాడారు.
Revanth Reddy Road Show in Kamareddy : ఈ సందర్భంగా బీడీ కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రేవంత్ పేర్కొన్నారు. కామారెడ్డి ప్రాంతంలో భూములను కొల్లగొట్టేందుకే కేసీఆర్ ఇక్కడ పోటీ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఓటుకు రూ.పది వేలు ఇచ్చి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారన్న రేవంత్.. ఆదమరచి కేసీఆర్‌కు ఓటు వేస్తే రూ.కోట్ల విలువైన భూములను కొల్లగొడతాడన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డిలో పరిశ్రమల కారిడార్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కామారెడ్డి ప్రజలు గొప్ప తీర్పును ఇవ్వాలని కోరారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే - ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటా : రేవంత్‌రెడ్డి