తెలంగాణ

telangana

ETV Bharat / state

కామారెడ్డి జిల్లాలో మోగిన బడి గంట - Schools started in Telangana

కరోనా ప్రభావంతో సుమారు 9నెలల పాటు పాఠశాలలు మూతపడ్డాయి. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడం వల్ల పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9,10 తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కామారెడ్డి జిల్లాలో మోగిన బడి గంట
కామారెడ్డి జిల్లాలో మోగిన బడి గంట

By

Published : Feb 1, 2021, 3:11 PM IST

కామారెడ్డి జిల్లాలోనే 214 ప్రభుత్వ పాఠశాలలు ఇవాళ తెరుచుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 26 వేల 44 మంది 9, 10 తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయులు సన్నద్ధమయ్యారు.

మొదటి రోజు కావడంతో తక్కువ సంఖ్యలో విద్యార్థులు పాఠశాలలకు చేరుకున్నారు. వచ్చిన విద్యార్థుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాలను తీసుకున్నారు. విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లు, గ్లౌసులు అందజేశారు. తరగతి గదిలో ఒక బెంచీపై ఒక విద్యార్థిని మాత్రమే కూర్చోబెట్టారు. 9 నెలల తర్వాత పాఠశాలకు రావడం సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారు.

ఆన్​లైన్​ తరగతుల ద్వారా కొన్ని సందేహాలు నివృత్తి చేసుకోలేకపోయామని... ప్రస్తుతం ఉపాధ్యాయుల ద్వారా అన్ని సందేహాలను నివృత్తి చేసుకుంటామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details