తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్డీఓ రాజేశ్వర్ స్పష్టం చేశారు. బాన్సువాడలో బతుకమ్మ చీరలను పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుదర్శన్, బాన్సువాడ ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట్రాంరెడ్డి, తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, సొసైటీ ఛైర్మన్ కృష్ణారెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఆర్డీఓ - Batukamma Sarees
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బతుకమ్మ చీరలను ఆర్డీఓ రాజేశ్వర్ పంపిణీ చేశారు. ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా.. ప్రభుత్వం బతుకమ్మ చీరలను కానుకగా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
చీరలు పంపిణీ చేసిన ఆర్డీఓ