కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో రాశివనం పేరుతో మొక్కల పెంపకం చేపట్టారు. హరితహారం స్ఫూర్తితో మూడెకరాల విస్తీర్ణంలో రకరకాల పూల, ఔషధ మొక్కలు పెంచుతున్నారు. మరో నాలుగెకరాల విస్తీర్ణంలో పండ్ల మొక్కలు నాటారు. రాశివనంలో సుమారు 4,200 పైగా మొక్కలు ఉన్నాయి. చెట్ల పెంపకం కోసం ఏర్పాటు చేసిన కుంటలు.. అక్కడక్కడా ఏర్పాటు చేసిన ప్రతిమలు ఆకర్షిస్తున్నాయి.
ఎవరైనా మొక్కను పెంచుకోవచ్చు..
పకృతి శోభాయమానంగా కనువించు చేస్తున్న రాశివనంలో సేద తీరేందుకు స్థానికులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఉదయపు, సాయంత్రం నడకకు వస్తూ పకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ వనానికి నిధులు సమకూర్చడం, మొక్కలు పెంపకం బయట వ్యక్తులే చేస్తున్నారు. దీనిలో ఎవరైనా మొక్కలు నాటుకోవచ్చు. దాని పెంపకానికి అయ్యే ఖర్చును చెల్లించి మొక్కను పెంచుకోవచ్చు.