కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని ఇస్మాయిల్ అనే వ్యక్తి ఇంట్లోకి పెద్ద కొండ చిలువ ప్రవేశించింది. దీనితో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే పాములు పట్టే వ్యక్తి సాయిలుకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న సాయిలు.. కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశాడు. కాలనీకి ఆనుకోని గుట్ట ఉండటం వల్ల తరచూ.. అడవి పందులు, పాములు వస్తున్నా... పంచాయతీ అధికారులు, అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంట్లోకి వచ్చిన కొండచిలువ.. - python that came into the house at lingampet
పాముని చూస్తేనే భయపడతాము.. అలాంటిది ఏకంగా ఓ పెద్ద కొండ చిలువ ఇంట్లోకి దూరింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోని ఓ ఇంట్లో చోటుచేసుకుంది.
![ఇంట్లోకి వచ్చిన కొండచిలువ.. python that came into the house at lingampet, kamareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11308660-609-11308660-1617756917306.jpg)
నేరుగా ఇంట్లోకి వచ్చిన కొండచిలువ