పీఆర్సీ నివేదిక రూపకల్పనలో ఎలాంటి ప్రామాణాలు పాటించలేదని కామారెడ్డి జిల్లా పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కుశాల్ ఆరోపించారు. మూడేళ్లుగా పెండింగ్‌లో ఉంచి ఇంత దారుణంగా పీఆర్సీ ప్రకటిస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పీఆర్సీ ప్రకటనను వ్యతిరేకిస్తూ బాన్సువాడ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. పెరుగుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా వేతన సవరణ రూపొందించాల్సిన పీఆర్సీ నివేదిక పారదర్శకంగా లేదన్నారు.
'పీఆర్సీ రూపకల్పనలో పారదర్శకత లేదు '
మూడేళ్ల నుంచి ప్రభుత్వానికి సహకరిస్తున్నా ఇంత తక్కువ పీఆర్సీ ప్రకటించడం ఉద్యోగులను ఆందోళనకు గురి చేసిందని కామారెడ్డి జిల్లా పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కుశాల్ అన్నారు. పీఆర్సీ నివేదిక అసంబద్ధంగా రూపొందించారని ఆయన అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బాన్సువాడ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
చర్చల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే పీఆర్సీని ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పీఆర్సీ నివేదికను దహనం చేశారు. అనంతరం తహసీల్దార్ గంగాధర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నర్వ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మంద ప్రవీణ్ కుమార్, రాష్ట్ర బాధ్యులు వెంకట్ గౌడ్, రాంచందర్, రామకృష్ణ, సంతోశ్, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా బాధ్యులు పురుషోత్తం, మండల కార్యవర్గ సభ్యులు దాసరి రవీందర్, హరీశ్ మేడం, ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు.