ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యూరియా కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతులు ధర్నాలు, రాస్తారోకోలతో తమ నిరసన తెలుపుతున్నారు. మోపాల్ మండల కేంద్రంలో యూరియా ఇవ్వట్లేదని అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. కామారెడ్డి జిల్లాలో మూడు రోజులుగా సొసైటీ వద్ద రైతులు బారులు తీరుతున్నారు. పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నందున కర్షకులకు యూరియా దొరకడం లేదు. తక్కువ మందికి సరిపడే యూరియా లోడ్ రావటం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
యూరియా కోసం రైతులకు తప్పని కష్టాలు - protest for not giving urea to farmers
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులు యూరియా కోసం మూడు రోజులుగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు. ప్రభ్వుత్వం ఇప్పటికైనా స్పందించాలని వారు కోరుతున్నారు.
యూరియా కోసం రైతులకు తప్పని కష్టాలు