తెలంగాణ

telangana

ETV Bharat / state

వర్షానికి చెరువులు, కుంటలు జలకళ - సింగీతం ప్రాజెక్టు​

కామారెడ్డి జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి సెలయేర్లు జలకళ సంతరించుకున్నాయి. జిల్లాలోని వాగులు, చెరువుల్లో భారీగా నీరు చేరి అన్నదాతలకు ఉపశమనం కలిగించాయి.

పొంగి పొర్లుతున్న వాగులు వంకలు సెలయేర్లు

By

Published : Jul 20, 2019, 7:26 PM IST

కామారెడ్డి జిల్లాలోని వాగులు కుంటలు జలమయమయ్యాయి. పది రోజులుగా కనుమరుగైన వర్షాలు..ఇప్పుడిప్పుడు పడుతుండటంతో కుంటలు నిండిపోతున్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని ముసళ్ల చెరువు నిండు కుండను తలపిస్తోంది.
జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలంలోని సింగీతం ప్రాజెక్టు​ నుంచి వస్తున్న వరదతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్షానికి రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ..వరి నాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు.

పొంగి పొర్లుతున్న వాగులు వంకలు సెలయేర్లు
ఇవీ చూడండి : వర్షాలు కురవాలని బోనాలతో ప్రత్యేక పూజలు

ABOUT THE AUTHOR

...view details