కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. రేపు హనుమాన్ జయంతి, గుడ్ ఫ్రైడే, శుక్రవారం నమాజ్ సందర్భంగా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని మత పెద్దలతో సమావేశమయ్యారు. ప్రజలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడొద్దని సూచించారు. హనుమాన్ శోభ యాత్ర కార్యక్రమంలో ఎలాంటి గొడవలు జరగకుండా వాలంటీర్లు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. మతపరమైన గొడవలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.
ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో శాంతి కమిటీ సమావేశం - ఎల్లారెడ్డి
హనుమాన్ జయంతి, గుడ్ ఫ్రైడే, శుక్రవారం ముస్లింల ప్రార్థనల సందర్భంగా ప్రజలంతా శాంతి భద్రతలు పాటించాలని ఎల్లారెడ్డి డీఎస్పీ సత్తన్న శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలీస్ స్టేషన్లో శాంతికమిటీ