వినాయక నిమజ్జనంలో ఓ పోలీసు అధికారి తన భక్తిని చాటుకున్నాడు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం రూసేగావ్లో గణేశుడి నిమజ్జనానికి బందోబస్తుకు వెళ్లిన ఏఎస్సై వెంకట్రావ్.. స్థానికులతో పాటు భజన చేశారు. ఈ మండలం మహారాష్ట్ర సరిహద్దున ఉన్నందున ఆ రాష్ట్ర సాంప్రదాయం ప్రకారం భజన పాటలతో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పోలీసులు కూడా పాటలు పాడుతూ అందరిని ఆకట్టుకున్నారు.
వినాయకుడికి పోలీసు అధికారి భజన - మహారాష్ట్ర
గణేశుడి శోభయాత్రలో ఓ పోలీసు అధికారి భజన చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా రూసేగావ్లో గ్రామస్థులతో కలిసి భక్తిని చాటుకున్నారు.
![వినాయకుడికి పోలీసు అధికారి భజన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4432046-thumbnail-3x2-police.jpg)
వినాయకుడికి పోలీసు అధికారి భజన