Vehicles seize: కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీసులు మూకుమ్మడిగా వాహనాల తనిఖీలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్, నిజాంసాగర్ చౌరస్తా, పాత బస్టాండ్ ప్రాంతాల్లో మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. పోలీసులు ఒక్కసారిగా తనిఖీలు చేపట్టడంతో వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
అదనపు ఎస్పీ వార్నింగ్
కొత్త బస్టాండ్ వద్ద అదనపు ఎస్పీ అన్యోన్య హల్ చల్ సృష్టించారు. హెల్మెట్ లేకున్నా, మొబైల్ మాట్లాడుతున్న ప్రతి వాహనాన్ని ఆపుతూ ఫైన్ విధించారు. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ బైక్ నడిపే వారిని హెచ్చరించారు. ప్రతి రోజు మొత్తుకుంటున్నా వినిపోయించుకోకపోతే ఎలా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఓ వాహనదారుడు పోలీసులకు ఎదురు మాట్లాడటంతో అడిషనల్ ఎస్పీ ఫైర్ అయ్యారు. వాహనాన్ని సీజ్ చేయాలని అధికారులకు సూచించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. సుమారు 250 వాహనాల వరకు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.