తెలంగాణ

telangana

ETV Bharat / state

పౌష్టిక ఆహారంతో 70 శాతం సుఖప్రసవాలు: పోచారం

ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహారంతో సుఖ ప్రసవాలు 70 శాతం పెరిగాయని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. గర్భిణీకి పౌష్టికాహారం అందిస్తేనే పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. నియోజకవర్గ అంగన్​వాడి టీచర్లు, ఆయాలతో సమావేశమై వారికి శాసన నూతన వస్త్రాలను పంపిణీ చేశారు.

Pocharam Srinivasareddy meeting with anganvadi workers
పౌష్టిక ఆహారంతో సుఖ ప్రసవాలు 70 శాతం పెరిగాయి: పోచారం

By

Published : Feb 6, 2021, 4:26 PM IST

పుట్టినప్పుడే బిడ్డ ఆరోగ్యంగా ఉంటే జీవితాంతం బలంగా, ఆరోగ్యంగా జీవిస్తారని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం, బీర్కుర్, నసరుల్లాబాద్ మండలాల పరిధిలోని అంగన్​వా​డి టీచర్లు, ఆయాలతో సమావేశమై వారికి నూతన వస్త్రాలను పంపిణీ చేశారు.

గర్భిణీకి పౌష్టికాహారం అందిస్తే పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. అందుకే అంగన్​వాడి సెంటర్ల ద్వారా పేదరికంలో ఉన్న మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందిస్తుందని తెలిపారు.

70 శాతం పెరిగాయి..

ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారంతో సుఖ ప్రసవాలు 70 శాతం పెరిగాయని తెలిపారు. కేవలం 30 శాతం మాత్రమే ఆపరేషన్లు అవుతున్నాయన్నారు. నియోజకవర్గంలో మహిళలు ఇబ్బంది పడకుండా రూ. 20 కోట్లతో బాన్సువాడ పట్టణంలో మాతా శిశు ఆసుపత్రి నిర్మించామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజా గౌడ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబి అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:రుణాన్ని చెల్లించలేక ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details