తెలంగాణ

telangana

ETV Bharat / state

గరిష్ఠ స్థాయి నీటి మట్టానికి చేరిన పోచారం ప్రాజెక్టు

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు లింగంపేట వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా పోచారం ప్రాజెక్టులోకి 4533 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.

By

Published : Aug 21, 2020, 5:18 PM IST

గరిష్ఠ స్థాయి నీటి మట్టానికి చేరిన పోచారం ప్రాజెక్టు
గరిష్ఠ స్థాయి నీటి మట్టానికి చేరిన పోచారం ప్రాజెక్టు

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలు మంచిప్ప, గాంధారి అటవీ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు లింగంపేట వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా పోచారం ప్రాజెక్టులోకి 4533 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.

మొత్తం 1464 అడుగులు...

ప్రస్తుత నీటిమట్టం 1463.58 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి మట్టం 1464 అడుగులుగా ఉంది. ప్రస్తుతం నీటి నిల్వ 1.750 టీఎంసీలు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ 1.820 టీఎంసీలు. పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిండి గేట్లపైనుంచి నీళ్లు పారుతున్నట్లు నీటిపారుదల శాఖ ఉప ఇంజినీర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

గరిష్ఠ స్థాయి నీటి మట్టానికి చేరిన పోచారం ప్రాజెక్టు

ఇవీ చూడండి :సీమ ఎత్తిపోతలపై తెలంగాణ వాదనలు వినేందుకు ఎన్జీటీ అంగీకారం

ABOUT THE AUTHOR

...view details