కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో వ్యవసాయ కార్యాలయం వద్ద రైతు వేదికకు తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో రైతు వేదికలు ఆధునిక దేవాలయాలు లాంటివని సభాపతి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో రైతు వేదికలను ఏర్పాటు చేయడం సీఎం కేసీఆర్ కృషి వల్లే జరుగుతుందని తెలిపారు.
నీళ్లు లేక పంటలు ఎండిపోయే రోజులు రావిక: పోచారం - pocharam bhumi pooja for rythu vedika at banswada
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు వేదిక భవనాల నిర్మాణం వేగంగా సాగుతోంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో వ్యవసాయ కార్యాలయం వద్ద రైతు వేదిక నిర్మాణానికి సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఢోకా ఉండదని ఆయన తెలిపారు.

బాన్సువాడలో రైతు వేదికకు సభాపతి పోచారం శంకుస్థాపన
ఉమ్మడి జిల్లాల రైతులకు ఏ కాలంలోనైనా వేసిన పంటకు ఎలాంటి ఢోకా లేకుండా రెండు పంటలకు కావాల్సిన నీరు అందిస్తామని సభాపతి తెలిపారు. కొండపోచమ్మ సాగర్ నుంచి శ్రీరామసాగర్ జలాశయానికి నీటిని మళ్లించి అటునుంచి అలీసాగర్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా నిజాంసాగర్‌కు తరలిస్తామన్నారు. నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు పంట పండించే విషయంలో సాగునీరు అందజేయడంలో ఎలాంటి ఢోకా ఉండదని ఆయన తెలిపారు.