కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. గేట్ల పైనుంచి నీరు అలుగు పారుతోంది. ప్రస్తుతం జలాశయంలో1.820 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
అలుగు పారుతున్న పోచారం ప్రాజెక్టు - కామారెడ్డి జిల్లా వార్తలు
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలోని పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి గేట్ల పైనుంచి నీరు అలుగు పారుతోంది.
అలుగు పారుతున్న పోచారం ప్రాజెక్టు
గాంధారి, లింగంపేట వాగుల నుంచి 1470 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. నాలుగు గేట్ల ద్వారా 3000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు.
ఇదీ చదవండి:నాగార్జునసాగర్‌కు భారీగా చేరుతున్న వరదనీరు