కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఈనాడు -ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి సత్యనారాయణ, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ శ్వేత, మున్సిపల్ ఛైర్మన్ శైలజ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని గాంధారి పరిధిలోగల నేరెళ్ల గ్రామం పచ్చదనం పరిశుభ్రతకి మారు పేరని... అతి చిన్న ఊరైనప్పటికీ... గాంధీజీ ఆశయాలను చక్కగా పాటిస్తున్నారని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి 11 వేల కిలోల ప్లాస్టిక్‌ని సేకరించినట్లు... త్వరలోనే గ్రామాలన్నింటినీ ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా రూపొందిస్తామని అధికారులు వెల్లడించారు. ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగాన్ని నిలిపివేసి పర్యావరణహితానికి పాటు పడాలని సూచించారు.
'త్వరలోనే ప్లాస్టిక్ రహిత జిల్లాగా కామారెడ్డి' - ప్లాస్టిక్ నియంత్రణ
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.

'త్వరలోనే ప్లాస్టిక్ రహిత జిల్లాగా కామారెడ్డి'
'త్వరలోనే ప్లాస్టిక్ రహిత జిల్లాగా కామారెడ్డి'