తెలంగాణ

telangana

ETV Bharat / state

తాడ్వాయిలో ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకలు!

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటోగ్రఫీ పితామహుడికి పూలమాల వేసి నివాళులర్పించారు. మండలంలోని ఫొటోగ్రాఫర్లందరూ కలిసి ఫొటోగ్రఫీ గొప్పతనాన్ని వివరించారు. మనిషి భావాలకు సరైన అర్థాన్నిచ్చే ప్రతిరూపాన్ని సృష్టించగలిగేదే ఫొటోగ్రఫీ అన్నారు.

By

Published : Aug 19, 2020, 4:54 PM IST

Photography Day Celebrations In Tadway Mandal
తాడ్వాయిలో ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకలు!

ఫోటో.. మనిషి భావాలకు, ఆలోచనలకు ప్రతీక. మనిషి మాట్లాడలేని, మాట్లాడడానికి సాధ్యం కాని ఎన్నో భావాలను ఒక ఫొటో పలికిస్తుంది. మనిషి అనుభవించిన తీపిగుర్తులు, అనుభూతులు పదిలంగా దాచుకునే మధుర స్మృతులను మళ్లీ మళ్లీ అనుభవించేలా చేసేది ఫొటోగ్రఫీ. ఆగష్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఫొటోగ్రఫీ పితామహుడికి మండల కేంద్రంలోని ఫొటోగ్రాఫర్లు నివాళులు అర్పించారు. పురాతన కాలంలో చిత్రం గీయడంతో మొదలై ఆ తర్వాత కెమెరా రకరకాలుగా అభివృద్ధి చెందుతూ టెక్నాలజీ వేగాన్ని అందుకుంది. ప్రతి మనిషిని మానసిక ఉల్లాసానికి, సామాజిక పరిపక్వతకు, మనోవికాసానికి, ఆలోచనలకు, సృజనాత్మకకు ఈ ఫోటోగ్రఫీ కారణం అని వారు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details