రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో నిరుపేదలకు యువర్స్ లైఫ్ ఫౌండేషన్ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిత్యం సుమారు 200 మందికి అన్నదానం చేస్తున్నట్లు ఫౌండేషన్ నిర్వహకుడు వేణు గోపాల్ తెలిపారు. తమ సొంత డబ్బుతో పేద ప్రజలకు భోజనం పెట్టడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తమకు ఎవరైనా దాతలు మందుకు వచ్చి సాయం చేస్తే... లాక్డౌన్ ఉన్నన్ని రోజులు సేవ కార్యక్రమాలు విస్తృతం చేస్తామన్నారు.
యువకుల దాతృత్వం.. పేదలకు అన్నదానం - yours life foundation latest news
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో యువర్స్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధి లేని నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పేదల ఆకలి తీర్చడం ఎంతో ఆనందంగా ఉందని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.
![యువకుల దాతృత్వం.. పేదలకు అన్నదానం yours life foundation latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6973418-967-6973418-1588065356569.jpg)
yours life foundation latest news
బాన్సువాడ డీఎస్పీ దామోదర్ రెడ్డి అన్ని రకాలుగా సాయ సహకారాలు అందిస్తున్నారని ఫౌండేషన్ సభ్యులు తెలియజేశారు. పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో యువర్ లైఫ్ ఫౌండేషన్ సభ్యులు సచిన్ యాదవ్, రాజు, జంగం సాయి కృష్ణ , రవికిరణ్, వేద్ ప్రకాశ్, కులకర్ణి, సాయికృష్ణ పాల్గొన్నారు.