Police Officer Pet Dogs Attack On Neighbour Women In Sangareddy : పెంపుడు కుక్కలు ఉంటే పెంచిన వారికి ముద్దు కాని.. పక్కింటి వారికి ముద్దు కాదు కదా. అవి ఏం చేసిన వాటిని పెంచిన యజమానిని ప్రశ్నిస్తామే తప్ప.. ఆ శునకాలను కాదు. అలా తమ ఇంటి ముందు ఎందుకు కుక్కలతో మల విసర్జన చేయిస్తున్నావు అన్నందుకే.. పక్కటి మహిళపై పెంపుడు కుక్కల(Pet Dogs)తో ఓ పోలీస్ అధికారి భార్య దాడి చేయించింది. తీవ్రగాయాలైన ఆమె పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని రాజస్థాన్‌కు చెందిన ప్రకాశ్, వీణ ఇంటి నంబర్ 27లో గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. అయితే వీరి పక్క ఇంట్లో ఓ ఎస్పీఎఫ్ అధికారి కుటుంబం కూడా నివాసం ఉంటోంది. వారు రక్షణ కోసం కుక్కలను పెంచుకుంటున్నారు. అవి మల, మూత్ర విసర్జన చేయాల్సి వస్తే బయటకు తీసుకొచ్చి రోడ్డు మీద గానీ, పక్క ఇంటి ముందు గానీ చేయించేవారు.
Dogs Attack On Neighbour Women : అంతేకాకుండా చెత్తచెదారం కూడా రోడ్డు మీద, పక్కింటి దగ్గర వేసేవారు. ఏమైనా ఇరుగుపొరుగు వారు ఇదేంటని ప్రశ్నిస్తే.. నోటికి వచ్చినట్లు మాట్లాడి తన భర్త పోలీస్ అధికారిణని బెదిరించేది. ఇలా కాదు ఒకసారి సామరస్యంగా చెప్పి చూద్దామని.. కుక్కలను బయట మల, మూత్ర విసర్జన చేయించవద్దని వీణ.. చెప్పి చూశారు. కానీ అందుకు భిన్నంగా ఎస్పీఎఫ్ అధికారి భార్య స్పందించారు. ఇది ఏమైనా నీ సొంతిల్లులా మాట్లాడుతున్నావు.. ఇంకోసారి అలా మాట్లాడవద్దని దబాయించింది.