కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌లో దారుణం చోటుచేసుకుంది. బస్టాండ్‌లో బస్సు దిగి బయటకు వస్తూ... ఓ వ్యక్తి కిందపడి శ్వాస ఆడక కొట్టుమిట్టాడాడు. అటు నుంచి చాలా మంది వెళ్లినా.. కరోనా భయంతో పట్టించుకోలేదు.
కరోనా భయం: ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్నా.. పట్టించుకోని జనం.. - kamareddy district corona news
కరోనా మహమ్మారి మానవత్వాన్ని సైతం మరిచేలా చేస్తోంది. రోడ్డుమీద ఊపిరాడక ఓ వ్యక్తి విలవిలాడుతుంటే.. కరోనా ఉందేమోననే భయంతో ఎవరు అతని దగ్గరుకు పోలేదు. చివరకు ఆర్టీసీ అధికారుల చొరవతో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
కరోనా భయం: ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్నా.. పట్టించుకోని జనం..
సుమారు గంటపాటు శ్వాస తీసుకోవడంలో ఆ వ్యక్తి ఇబ్బంది పడ్డాడు. చివరకు ఆర్టీసీ అధికారుల చొరవతో 108 అంబులెన్స్‌లో కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇబ్బంది పడ్డ వ్యక్తిది మెదక్ జిల్లా బూరుగుపల్లి గ్రామానికి చెందిన హన్మంతు(55)గా గుర్తించారు.
ఇదీ చూడండి:-రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!