కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం సాయికృపా నగర్‌లోని షెడ్యూల్ తెగల బాలుర వసతి గృహంలో కరోనా రోగుల కొరకు ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. తమ కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని తొలగించాలని కాలనీవాసులు ఆందోళనకు దిగారు. వారు ఆందోళన ఉద్ధృతం చేయడం వల్ల సంఘటన స్థలానికి తహసీల్దార్ చేరుకుని కాలనీవాసులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ కాలనీవాసులు వెంటనే ఇతర ప్రదేశానికి మార్చాలని డిమాండ్ చేశారు.
క్వారంటైన్ కేంద్రాన్ని తొలగించాలని కాలనీవాసుల ఆందోళన - kamareddy district news
బాన్సువాడ పట్టణంలోని సాయికృపానగర్‌లో కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. కాలనీలోని షెడ్యూల్ తెగల బాలుర వసతి గృహంలో కరోనా రోగుల కొరకు ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

క్వారంటైన్ కేంద్రాన్ని తొలగించాలని కాలనీవాసుల ఆందోళన
క్వారంటైన్ కేంద్రాన్ని పట్టణానికి దూరంగా ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేయాలని తహసీల్దార్‌కు కాలనీవాసులు వినతిపత్రం సమర్పించారు. తమ ప్రాణాలకు ముప్పు తెచ్చే ఈ కేంద్రాన్ని ఇతర ప్రదేశానికి మార్చాలని కోరారు. లేకుంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని కాలనీవాసులు తెలిపారు.
ఇవీ చూడండి:'కరోనాను కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం'