బస్టాండ్‌లో కనిపిస్తున్నవారు బస్సు కోసం వేచిచూస్తున్నారు అనుకుంటున్నారా? కాదు... పింఛన్ తీసుకునేందుకు వచ్చినవారు. బస్టాండులో పింఛను ఇవ్వడమేంటి అనే సందేహం వచ్చిందా?. ఏం లేదండీ... కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం మహారాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. అక్కడి గ్రామాల్లో సరిగ్గా సిగ్నల్ రానందున తపాలశాఖ అధికారులు... పింఛన్ కోసం అందరూ మద్నూర్‌కు రావాలని సూచించారు. ఉదయం వచ్చి పింఛన్ తీసుకునేందుకు... నిరుపయోగంగా ఉన్న బస్టాండులో ఎదురుచూస్తున్నారు. అధికారులు మధ్యాహ్నం వచ్చి పింఛన్ ఇస్తారని వారు చెబుతున్నారు.
ఇక్కడ పింఛన్.. బస్టాండ్‌లో ఇస్తారు తెలుసా..? - pensioners wating in madnur
కామారెడ్డి జిల్లా మద్నూర్ బస్టాండ్.. వృద్ధులు, దివ్యాంగులు, పింఛన్‌దారులతో కిటకిటలాడుతోంది. గ్రామాల్లో సిగ్నల్స్ రానందున తపాలాశాఖ వారు మండల కేంద్రంలోనే పింఛన్ ఇస్తున్నారు. లబ్ధిదారులంతా నిరుపయోగంగా ఉన్న బస్టాండ్‌లో వేచి ఉంటే.. అధికారులు మధ్యాహ్నం వచ్చి పింఛన్ ఇస్తారని చెబుతున్నారు.

ఇక్కడి పింఛన్ బస్టాండ్‌లో ఇస్తారు తెలుసా..?
ఇక్కడ పింఛన్.. బస్టాండ్‌లో ఇస్తారు తెలుసా..?