తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతుల కళ్లల్లో ఆనందం కోసం కృషి చేయాలి' - 'రైతుల కళ్లల్లో ఆనందం కోసం కృషి చేయాలి'

ఏళ్లుగా ఉన్న సమస్యను కష్టపడి పరిష్కరించి... రైతుల ముఖాల్లో ఆనందం కల్పించారు రెవెన్యూసిబ్బంది. అటవీ శాఖకు రైతులకు మధ్య సాగిన వ్యవహారం కొలిక్కి తెచ్చి పట్టాలు పంచారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో చోటుచేసుకుంది.

PASS BOOKS DISTRIBUTION TO 78 FARMERS IN BANSWADA BY SPEAKER POCHARAM
PASS BOOKS DISTRIBUTION TO 78 FARMERS IN BANSWADA BY SPEAKER POCHARAM

By

Published : Feb 4, 2020, 6:49 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాంపూర్​కు చెందిన 78 మంది రైతులకు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పట్టాలు పంపిణీ చేశారు. కలెక్టర్ సత్యనారాయణ ప్రత్యేక చొరవతోనే రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేసినట్లు పోచారం ప్రశంసించారు. దీర్ఘకాలంగా కృషి చేసి రైతుల సమస్యకు పరిష్కరించిన రెవెన్యూ సిబ్బందికి పోచారం కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెవెన్యూ సిబ్బంది రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

'రైతుల కళ్లల్లో ఆనందం కోసం కృషి చేయాలి'

ఇదీ చూడండి:మేడారం ఎఫెక్ట్: ములుగుకు నలభైరోజుల్లో నాలుగో 'సారు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details