కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో సీఎం కేసీఆర్, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు రూ.500కోట్లు మంజూరు చేసినందుకు జడ్పీటీసీ పద్మ గోపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
బాన్సువాడలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం - తెలంగాణ వార్తలు
బాన్సువాడ మండల పరిషత్ కార్యాలయంలో సీఎం కేసీఆర్, సభాపతి పోచారం, ఎమ్మెల్సీ కవిత చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అభివృద్ధికి ఉపయోగపడేలా నిధులు కేటాయించారని జడ్పీటీసీ పద్మ గోపాల్ రెడ్డి అన్నారు. అనంతరం మొక్కలు నాటారు.
బాన్సువాడలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
జడ్పీటీసీ పద్మ గోపాల్ రెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజ వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్షీరాభిషేకం అనంతరం మండల పరిషత్ ఆవరణలో మొక్కలు నాటారు.
ఇదీ చదవండి:ఓ పౌరుడి ట్వీట్‌కు కేటీఆర్ రెస్పాండ్.. అధికారులకు ఆదేశం