లాక్‌డౌన్ నేపథ్యంలో యాసంగి ధాన్యం సేకరణలో ఇబ్బందులు తలెత్తకుండా కామారెడ్డి జిల్లా అధికారులు కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచారు. అలాగే ప్రాథమిక సహకార సంఘాల పాలకవర్గాలకు కొనుగోలు బాధ్యత అప్పగించారు. రైతుల చెంతకు వెళ్లి పంటపొలాల్లోనే కొనుగోళ్లు చేపడుతున్నప్పటికీ....ధాన్యం తరలింపులో జాప్యం నెలకొంటోంది.
వీటిపై దృష్టి సారించాలి...
- ధాన్యంలో తాలు అధికంగా ఉందంటూ బియ్యం మిల్లర్లు భారీగా కోత పెడుతున్నారు. రెండు కిలోల వరకు ‘కోత’ పెడుతుండటంతో కర్షకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
- హమాలీల కొరత తీవ్రంగా ఉంది.. గతంలో బిహార్ కూలీలు పని చేసేవారు... లాక్‌డౌన్ నేపథ్యంలో వారంతా సొంత రాష్ట్రం వెళ్లిపోయారు. బియ్యం మిల్లుల వద్ద ధాన్యం సంచులు లారీల నుంచి దింపడంలో జాప్యం నెలకొంటోంది.
- ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం బాగున్నా... ఎలక్ట్రానిక్ కాంటాలు లేక సాధారణ కాంటాలతోనే కొనుగోళ్లు జరుగుతున్నాయి.
- రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసే విషయంలో ప్రాథమిక సహకార సంఘాల నిర్వాహకులు ఆలస్యం చేస్తున్నారు.