ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతిగా మరోసారి రుజువైందని డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. ధాన్యం అమ్ముకునేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి రైతుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం రాంపూర్తాండలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
రైతులు నష్టపోకూడదనే కొనుగోలు కేంద్రాలు: పోచారం భాస్కర్ రెడ్డి - డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి
రైతులు నష్టపోకూదనే ధాన్యం కొనుగోలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేశారని డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం రాంపూర్తాండలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
రాంపూర్తాండలో ధాన్యం కొనుగోలు కేంద్రం
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలను పక్కన పెట్టి... రైతుల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. మొదట ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని రైతన్నలు బాధపడ్డారని తెలిపారు. మంచి మనసుతో అన్నదాతలను ఆదుకుంటున్న సీఎంకు పోచారం భాస్కర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.