కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని జీఎంఆర్ గార్డెన్ సమీపంలో ఓ వ్యక్తి బైక్ ఆగిపోయింది. వాహనదారుడు పలుమార్లు ప్రయత్నించినా స్టార్ట్ కాకపోవడం వల్ల విసుగుచెంది బండిలో పెట్రోల్ తీసి దానిపై పోసి తగులపెట్టాడు. అనంతరం శిరస్త్రాణం ధరించి నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
'బండి స్టార్ట్ కావడం లేదని పెట్రోల్ పోసి తగులబెట్టాడు' - బైక్పై పెట్రోల్ పోసి తగలబెట్టిన యజమాని
ద్విచక్రవాహనం స్టార్ట్ కాకపోవడంతో విసుగు చెంది ఓ వ్యక్తి ఏకంగా దానిని తగులబెట్టేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
ద్విచక్రవాహనాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన యజమాని
ఈ ఘటనలో ద్విచక్రవాహనం పూర్తిగా కాలిపోయింది. ఆ వ్యక్తి బానాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు.