కామారెడ్డి మున్సిపాలిటీ రామేశ్వరపల్లి గ్రామంలో సంతోష్-రమ్య దంపతుల మూడు నెలల చిన్నారి ఆకస్మాత్తుగా మృతి చెందింది. వెంటనే కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు.
'ఆ టీకా వల్లే మా చిన్నారి మృతి చెందింది' - child died of the vaccine
మూడు నెలల చిన్నారికి టీకాలు వేయించి పడుకోబెట్టారు.. కానీ అలాగే పడుకునే సరికి అనుమానం వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లారు. తీరా వైద్యులు మృతి చెందిందని చెప్పారు. ఆవేదన చెందిన కుటుంబ సభ్యులు అంగన్వాడీ కేంద్రంలో వేసిన టీకా వల్లే తమ చిన్నారి మరణించిందని ఆందోళన చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

'ఆ టీకా వల్లే మా చిన్నారి మృతి చెందింది'
ఈరోజు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారికి 3 నెలల టీకా వేయించామన్నారు. ఆ టీకా వికటించి చిన్నారి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆ టీకానే మృతికి కారణమని విలపించారు. ఇప్పటి వరకూ చిన్నారికి ఎలాంటి జబ్బు లేదని పేర్కొన్నారు. చిన్నారి మృతిపై దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
'ఆ టీకా వల్లే మా చిన్నారి మృతి చెందింది'
ఇదీ చూడండి :రేవంత్ జైలుకెళ్లింది అందుకోసం కాదు: రాజగోపాల్ రెడ్డి