కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని ధర్మారెడ్డి గ్రామ సమీపంలో కల్వర్టును ఢీకొని శనివారం రాత్రి ఓ ద్విచక్ర వాహనదారుడు మృతిచెందాడు. తుమ్మెద గ్రామానికి చెందిన మోరె రాజు (34) ద్విచక్ర వాహనంపై వెళ్తూ కల్వర్టును ఢీకొని పక్కకు పడిపోయాడు. రాత్రి ఎవరూ చూడకపోవడం వల్ల అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఆదివారం ఉదయం అటుగా వెళ్తున్న స్థానికులు అతన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మోహన్ తెలిపారు.
కల్వర్టును ఢీకొని ఒకరు మృతి - కల్వర్టును ఢీకొని ఒకరు మృతి
కల్వర్టును ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో చోటుచేసుకుంది.

కల్వర్టును ఢీకొని ఒకరు మృతి