కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తాళి కట్టిన చేతితోనే భార్యకు ఉరి తాడు బిగించాడు ఓ భర్త. అనంతరం తానూ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పక్షవాతంతో బాధపడుతున్న భార్యకు సపర్యలు చేసే ఆ భర్త... తనకు రోడ్డు ప్రమాదం జరిగి ఆమెను సరిగా చూసుకోలేకపోతున్నానని మనస్తాపం చెంది ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చిన్నమల్లారెడ్డికి చెందిన సిద్దయ్య (65), బాలమణి(56) దంపతులు పిల్లల పెళ్లిళ్లు చేసి ఇద్దరే ఉంటున్నారు.
తాళి కట్టిన చేతితోనే తాడు బిగించి ఉరి.. ఆపై భర్త ఆత్మహత్య - తెలంగాణ వార్తలు
మంచాన పడిన ఆ భార్యకు భర్తే అన్నీ తానైయ్యాడు. పక్షవాతంతో మంచానికే పరిమితమైన ఆమె ఆలనాపాలనా చూసుకున్నాడు. కానీ ఓ రోడ్డు ప్రమాదం వారి జీవితాన్ని తలకిందులు చేసింది. చేసేది లేక తాళి కట్టిన ఆ చేతితోనే మెడకు ఉరితాడు బిగించాడు ఆ భర్త. అనంతరం తానూ ఉసురు తీసుకున్నాడు.
వృద్ద దంపతులు ఆత్మహత్య, కామారెడ్డిలో దంపతుల ఆత్మహత్య
పక్షవాతం వచ్చి మంచం పట్టిన బాలమణికి సిద్దయ్య అన్నీ తానై సపర్యలు చేస్తుండేవారని బంధువులు వెల్లడించారు. ఆ తర్వాత తనకు రోడ్డు ప్రమాదం జరగడంతో భార్యను సరిగా చూసుకోలేకపోతున్నానని మనస్తాపం చెందినట్లు తెలిపారు. చివరకు భార్యను కిటికీ ఊచలకు ఉరి వేసి... అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు.
ఇదీ చదవండి:juda strike: సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ వైద్యులు