ఏడు లక్షల రుణాన్ని తీసుకున్నాడని.. 60 వాయిదాల్లో తీసుకున్న రుణాన్ని చెల్లించాలని హైదరాబాద్‌లోని ఎస్బీఐ జవహార్‌నగర్ శాఖ ఓ గొర్రెల కాపరి నోటీసులు జారీ చేసింది. అసలు రుణమే తీసుకోకుండా.. అంత మొత్తాన్ని తానెలా చెల్లించాలని ఇసన్నపల్లికి చెందిన కన్నాపురం బాలమల్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లికి చెందిన కన్నాపురం బాలమల్లుకు ఈ నెల పదో తేదీన హైదరాబాద్‌లోని ఎస్బీఐ జవహర్నగర్ శాఖ నుంచి నోటీసు వచ్చింది. మీరు గతేడాది డిసెంబర్ 12న ఏడు లక్షల రుణం తీసుకున్నారు. 60 వాయిదాలలో ఆ రుణాన్ని చెల్లించండి అని ఆ నోటీసులో పేర్కొన్నారు. అవాక్కయిన బాలమల్లు వివరాలు కనుక్కునేందుకు హైదరాబాద్‌లోని ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లాడు. అధికారులను కలిసి తనకు జవహర్ నగర్ శాఖలో బ్యాంక్ ఖాతా లేదని అసలు ఇప్పటివరకు ఈ బ్యాంకుకు రాలేదని చెప్పాడు. అలాంటప్పుడు నేను ఎలా రుణం తీసుకుంటానని ప్రశ్నించాడు.