లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి తెరాస అభ్యర్థిగా సీఎం కేసీఆర్ కూతురు, సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత పోటీచేయగా, భాజపా తరుఫున రాజ్యసభ సభ్యులు డీఎస్ తనయుడు ధర్మపురి అర్వింద్ బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ, కాంగ్రెస్ ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ పోటీ చేశారు. 178మంది పసుపు, ఎర్రజొన్న రైతులు పోటీ చేశారు. నియోజక వర్గంలో ఎక్కడ చూసినా అభ్యర్థుల గెలుపోటములపైనే చర్చ జరుగుతోంది. ఎవరికి వారే గెలుపు తమదేనని ధీమాగా ఉన్నారు.
అందరి చూపు ఇందూరు పైనే.. - kamareddy
పార్లమెంట్ ఎన్నికల్లో దేశ ప్రజలందరి దృష్టి ఆకర్షించిన నిజామాబాద్ ఎంపీ నియోజకవర్గం ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానం నుంచి అత్యధికంగా 185 మంది అభ్యర్థులు పోటీలో నిలువడం, ప్రపంచంలోనే తొలిసారిగా ఎం-3రకం ఈవీఎంలను ఈసీ వినియోగించి ఎన్నికలు విజయవంతంగా నిర్వహించింది. గెలుపే లక్ష్యంగా సర్వశక్తులొడ్డిన ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ఫలితాల కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
nizamabad-