తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజాంసాగర్‌కు కొనసాగుతున్న వరద... అన్నదాతల ఆనందం

కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తుతోంది. నాలుగేళ్ల తర్వాత ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండింది. సింగూరు ప్రాజెక్ట్‌ నుంచి భారీగా వరద నీరు రావడం వల్ల 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలకళ సంతరించుకున్న జలాశయాన్ని చూసి ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

nizam sagar project water levels in kamareddy
నిజాంసాగర్‌కు కొనసాగుతున్న వరద... అన్నదాతల ఆనందం

By

Published : Oct 17, 2020, 10:43 AM IST

Updated : Oct 17, 2020, 11:02 AM IST

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని జలాశయం నిండు కుండలా మారింది. సింగూరు ప్రాజెక్ట్ నుంచి వరద నీరు రావడంతో జలాశయం జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి 56,576 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. 8 గేట్లు ఎత్తి 56,576 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నాలుగేళ్ల తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడం వల్ల ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నిజాంసాగర్‌కు కొనసాగుతున్న వరద

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులకు గాను ప్రస్తుతం 1403.75 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు నీటి నిల్వ 17.802 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 16.012 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ఇదీ చదవండి:వరదలతో పాటే వ్యాధులు... పొంచి ఉన్న డయేరియా, మలేరియా, డెంగీ..

Last Updated : Oct 17, 2020, 11:02 AM IST

ABOUT THE AUTHOR

...view details