తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజాంసాగర్‌కు కొనసాగుతోన్న వరద... 9 గేట్లు ఎత్తివేత - నిజాంసాగర్‌ ప్రాజెక్ట్ నీటి నిల్వ

కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతోంది. 9 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు గాను... ప్రస్తుతం 1,403.5 అడుగులకు చేరింది.

nizam sagar project water flow in kamareddy
నిజాంసాగర్‌కు కొనసాగుతోన్న వరద... 9 గేట్లు ఎత్తివేత

By

Published : Oct 16, 2020, 10:18 AM IST

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి 63,455 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 9 గేట్లు ఎత్తి 64,836 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

  • ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు గాను... ప్రస్తుతం 1,403.5 అడుగులకు చేరింది.
  • జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 17.802 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 15.77 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ABOUT THE AUTHOR

...view details