కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల వస్తోన్న వరద, పోచారం జలాశయం మత్తడి ద్వారా వస్తోన్న నీటితో నిజాంసాగర్ జలాశయం సగం వరకు నిండింది. జలకళ ఉట్టిపడుతున్న నిజాంసాగర్‌ను చూసి, రైతులు సంబరపడుతున్నారు.
నిజాంసాగర్‌కు వరద ప్రవాహం.. అన్నదాతల సంబురం - nizam sagar project in kamareddy district
ఎగువన కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు సగం వరకు నిండింది. పోచారం జలాశయం మత్తడి ద్వారా వస్తున్న నీటితో నిజాంసాగర్‌కు జలకళ సంతరించుకుంది.
![నిజాంసాగర్‌కు వరద ప్రవాహం.. అన్నదాతల సంబురం Nizam Sagar project is flooded](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8977528-769-8977528-1601357746292.jpg)
నిజాంసాగర్‌కు వరద ప్రవాహం
నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా.. ప్రస్తుతం 1396 అడుగుల వరకు నీరు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 17.802 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.135 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 6914 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది.
- ఇదీ చూడండికరోనా ప్రభావమున్నా.. అధిగమించిన రైతన్న