విద్యార్థుల పరీక్షల కోసం నిజాంసాగర్ గేట్లను(Nizam sagar gates closed) అధికారులు మూసివేశారు. నిజాంసాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో వారం రోజులుగా కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కుర్తి గ్రామానికి వెళ్లే బ్రిడ్జి మునిగి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామంలోని డిగ్రీ విద్యార్థులకు శుక్రవారం పరీక్షలు ఉండటంతో అధికారులు స్పందించి... సాగర్ గేట్లను శుక్రవారం మూసివేశారు. విద్యార్థులను పరీక్షలకు పంపించారు.
Nizam sagar gates closed: విద్యార్థుల కోసం మూసుకున్న నిజాంసాగర్ గేట్లు..
నిజాంసాగర్ గేట్లను(Nizam sagar gates closed) రెండు గంటల పాటు మూసేశారు. విద్యార్థులు పరీక్ష రాయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఫలితంగా వారం రోజులుగా జలదిగ్బంధంలో చిక్కిన గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు. నిత్యావసరాల కోసం పరుగులు పెట్టారు.
నిత్యావసరాల కోసం పరుగులు, నిజాంసాగర్ గేట్లు మూసివేత
బ్రిడ్జి మునిగి వారం రోజులుగా నానా అవస్థలు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం గేట్లను మూసివేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గేట్లు తెరవడానికి రెండు గంటల సమయం ఇవ్వడంతో నిత్యావసర సరుకుల కోసం జనం పరుగులు పెట్టారు. మొత్తంమీద అధికారుల నిర్ణయం విద్యార్థులను పరీక్ష రాసేలా చేసింది.
ఇదీ చదవండి:CM KCR speech in assembly: సకల జనుల సహకారంతో తెలంగాణలో హరితనిధి: కేసీఆర్
Last Updated : Oct 1, 2021, 6:08 PM IST