తెలంగాణ

telangana

ETV Bharat / state

నిండుకుండలా నిజాం సాగర్‌ ప్రాజెక్టు.. 6 గేట్లు ఎత్తివేత - నిజాం సాగర్‌ ప్రాజెక్టు తాజా వార్తలు

ఎగువన కురిసిన వర్షాలతో నిజాం సాగర్‌ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రస్తుతం 6 గేట్లు ఎత్తి 45వేల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువకు వదిలారు. దీంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

nizam sagar filled with flood water kamareddy district
నిండుకుండలా నిజాం సాగర్‌ ప్రాజెక్టు.. 6 గేట్లు ఎత్తివేత

By

Published : Oct 15, 2020, 3:40 PM IST

ఎగువన కురిసిన వర్షాలతో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. సింగూరు ప్రాజెక్ట్ నుంచి రెండు రోజులుగా వరద నీరు రావడంతో 6 గేట్లు ఎత్తి 45 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.

  • ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా 1403.66 అడుగులకు చేరుకుంది.
  • పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలకు గాను 15.888 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
  • ఎగువ ప్రాంతాల నుంచి 1,19,000 క్యూసెక్కుల వరదనీరు జలాశయానికి వచ్చి చేరుతోంది.

నాలుగేళ్ల తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:'హాథ్రస్' కేసులో​ తీర్పు రిజర్వ్​ చేసిన సుప్రీం

ABOUT THE AUTHOR

...view details