కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని జలాశయం నిండుకుండలా మారింది. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరద నీరు నిజాంసాగర్‌లోకి వచ్చి చేరుతోంది. మధ్యాహ్నం లోపు ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోనుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14.097 టీఎంసీలు నిల్వ ఉంది. ఎగువ నుంచి 72,036 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
నిండుకుండలా నిజాంసాగర్ ప్రాజెక్టు... గేట్లు ఎత్తే అవకాశం - నిజాం సాగర్ ప్రాజెక్ట్ నీటి నిల్వలు
సింగూరు ప్రాజెక్ట్ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో నిజాంసాగర్ జలకళను సంతరించుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14.097 టీఎంసీలు నిల్వ ఉంది. వరద ఇలాగే కొనసాగితే మధ్యాహ్నం లోపు గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
నిండుకుండలా నిజాంసాగర్ ప్రాజెక్టు... గేట్లు ఎత్తే అవకాశం
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా ప్రస్తుతం 1402.32 చేరింది. వరదలు ఇలాగే కొనసాగితే మధ్యాహ్నం లోపు గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి:మూసీ వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన 11 లారీలు, సుమో, ట్రాక్టర్
Last Updated : Oct 15, 2020, 12:03 PM IST