తెలంగాణ

telangana

ETV Bharat / state

అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి: కలెక్టర్ శరత్ - తెలంగాణ వార్తలు

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్​లో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ శరత్ కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఓటు హక్కు వినియోగించుకునే వారు ఎక్కువగా ఉంటున్నారని తెలిపారు.

national-voters-day-celebrations-at-collectorate-in-kamareddy-district
అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి: కలెక్టర్ శరత్

By

Published : Jan 25, 2021, 3:56 PM IST

ఓటరు లేనిదే ప్రజాస్వామ్యం లేదని... 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఓటరు నమోదు కార్యక్రమంలో పనిచేసిన కార్యకర్తలకు అవార్డులు అందజేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకునే వారు ఎక్కువగా ఉంటున్నారని తెలిపారు. చదువుకున్నవారు మాత్రం ఓటు వేయడం లేదని అన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడంతో పాటు ప్రజల్లో అవగాహన పెంచి ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్, అసిస్టెంట్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:దేశీయ వ్యాక్సిన్​ వచ్చిన గర్వంతో గణతంత్ర వేడుకలు: గవర్నర్

ABOUT THE AUTHOR

...view details