తెలంగాణ

telangana

ETV Bharat / state

Bansuwada Hospital Best Award : బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి జాతీయ స్థాయి గుర్తింపు

Bansuwada Hospital Best Award : బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రి జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించి మరోసారి తన కీర్తి నిలుపుకుంది. దేశంలో వరుసగా ఐదోసారి కాయకల్ప పురస్కారం అందుకున్న ఏకైక ఆస్పత్రిగా గుర్తింపు పొందింది. మాతాశిశు సంక్షేమానికి సంబంధించి తల్లిపాలను ప్రోత్సహించడంలో అగ్రస్థానంలో నిలిచి అవార్డు కైవసం చేసుంది.

Bansuwada Hospital Best Award
Bansuwada Hospital Best Award

By

Published : Jul 24, 2023, 5:51 PM IST

బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి జాతీయ స్థాయి గుర్తింపు

Bansuwada Hospital Best Award : కామరెడ్డి జిల్లా బాన్సువాడ మాతా శిశు ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలకు అరుదైన గౌరవం దక్కింది. 2023ఏడాదికి ఉత్తమ సేవలు అందిస్తున్న ఆస్పత్రులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో బాన్సువాడ మాతా శిశు ఆస్పత్రికి రెండో స్థానం దక్కింది. ఈ అవార్డుతో పాటు 10లక్షల నగదును ప్రభుత్వం ప్రకటించింది. 2018 నుంచి 2023 వరకు ఐదుసార్లు కాయకల్ప పురస్కారం అందుకున్న ఏకైక ఆస్పత్రిగా బాన్సువాడ నిలిచింది.

జాతీయస్థాయి నాణ్యతా ప్రమాణాలను అనుసరించి అందిస్తున్న వైద్య సేవలకుగాను కాయకల్ప అవార్డులను జారీ చేస్తారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రజలకు అందుతున్న సేవల అధ్యయనానికి వచ్చిన కాయకల్ప బృందం ఆస్పత్రి సందర్శించింది. వైద్యసేవలు, సుందరీకరణ, శుభత్ర, అనుబంధ సేవలు, వ్యర్థ పదార్థాల నిర్వహణ, రోగవ్యాప్తి నివారణ, ఎకోఫ్రెండ్లీ తదితర విభాగాలపై అధ్యయనం చేశారు. పలు విభాగాలకు మార్కులు వేయడంతో కాయకల్ప అవార్డు సొంతమైంది.

'' దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ ఆస్పత్రిగా బాన్సువాడకు గుర్తింపువచ్చింది. పుట్టిన పిల్లలకు లోపాలుంటే స్కానింగ్ చేసి ముందే గుర్తించే విదంగా టిఫా స్కాన్ని 30 లక్షలతో ఏర్పాటుచేసుకున్నాము. బాన్సు​వాడ ఆస్పత్రికి నియోజకవర్గం నుంచే కాకుండా పక్కనున్న ఎల్లారెడ్డి , బోధన్ , మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల నుంచి రోగులు వస్తుంటారు. పేషంట్లు ఎక్కువగా రావడంతో బెడ్లు సరిపోలేదు. ఈ విషయంపై హరీష్​ రావు దృష్టికి తీసుకపోవడంతో వెంటనే స్పందించి వంద పడకల ఆస్పత్రిని మంజూరు చేశారు. బ్లెడ్ బ్యాంకు కూడా నాలుగేళ్ల క్రితం మంజూరు చేసుకున్నాము. బ్లెడ్ బ్యాంక్ క్యాంపులను ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటలు బ్లెడ్ అందుబాటులో ఉండేలా చూస్తున్నాము.'' - శ్రీనివాసప్రసాద్, సూపరింటెండెంట్

ఇక్కడి మాతా శిశు సంరక్షణ కేంద్రంలో తల్లిపాలు పట్టే విధానం, ప్రాముఖ్యంపై బాలింతలకు అందిస్తున్న సేవలపై ' బ్రెస్ట్‌ ఫీడింగ్ ప్రమోషన్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ ఇండియా ' సంస్థ అధ్యయనం చేసింది. దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ ఆస్పత్రిగా బాన్సువాడకు గుర్తింపునిచ్చింది. నిరుడు జాతీయస్థాయి మాతృత్వ సేవల విశిష్ట పురస్కారాన్ని అందుకుంది. బాన్సువాడ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సెంటర్‌కి ఫైవ్‌స్టార్‌ గుర్తింపు లభించింది. ఉత్తమ సేవలు అందిస్తున్న ఆస్పత్రికి నియోజకవర్గం నుంచే కాకుండా పక్కనున్న ఎల్లారెడ్డి , బోధన్ , మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల నుంచి రోగులు వస్తుంటారు

''బాన్సువాడ ఆస్పత్రిని మంచి సదుపాయాలతో నిర్మించుకున్నాం. పేదలు రూపాయి ఖర్చు లేకుండా వైద్యం చేసుకుంటున్నారు. డెలివరీలు అవుతున్నాయి. బ్రెస్ట్, మిల్క్, ఫ్రెండ్లీగా దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ ఆస్పత్రిగా బాన్సువాడకు గుర్తింపువచ్చింది. నవజాతి శిశువులకు ఇబ్బంది లేకుండా ప్రాణాపాయం లేకుండా సరైన వైద్య సేవలు ఏర్పాటు చేశాం. శారీరకంగా మానసికంగా కొంత వైకల్యం ఉన్న వ్యక్తులకు మంచి వైద్య సదుపాయం అందించేలా డాక్టర్లను నియమించాము.'' - పోచారం శ్రీనివాసరెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే

అధునాతన వైద్య పరికరాలు సమకూర్చుకుంటూ.. ప్రైవేట్‌ను మించి నాణ్యమైన వైద్యసేవలు అందిస్తుండటం వల్ల .. ఈ ప్రభుత్వ ఆస్పత్రికి రోగులు సంఖ్యా రోజురోజుకు పెరుగుతోంది.

ఇవీ చదవండి.

Balakrishna Comments at Basavatharakam Hospital : 'దేశంలోనే రెండో ఉత్తమ క్యాన్సర్ ఆస్పత్రి.. బసవతారకం'

Dr Raja Rao Interview : 'గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే.. ఎంసీహెచ్‌ కేంద్రాలు'

ABOUT THE AUTHOR

...view details