కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో నల్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని నల్లవాగులోకి భారీ వరద ప్రవాహం వస్తోంది.
ఉప్పొంగి ప్రవహిస్తోన్న నల్లవాగు.. పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
సంగారెడ్డి జిల్లా మీదుగా కామారెడ్డి జిల్లా పిట్లంలో నల్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో గత కొద్దిరోజులుగా కురుస్తోన్న వర్షాలతో భారీగా వరదనీరు వాగులో వచ్చి చేరుతోంది.
ఉప్పొంగి ప్రవహిస్తోన్న నల్లవాగు
కామారెడ్డి జిల్లా పిట్లం, సంగారెడ్డిలోని కల్హేర్ మండలాల సరిహద్దులో ఉన్న వంతెనపై నుంచి నల్లవాగు పొంగి ప్రవహిస్తోంది. వాగు నీరు మంజీరా నదిలో కలిసి నిజాంసాగర్ మండలం నర్సింగరావు పల్లి చెరువు వద్ద మత్తడి అలుగు పోస్తోంది. ఫలితంగా పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
ఇవీ చూడండి:గేటెడ్ కమ్యూనిటీల్లో కరోనా చికిత్స